సంఘ్‌ను రైతులతో కలిసి ఎదుర్కొంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు వెనకడుగు వేయబోమని చెప్పారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కారుపై రాళ్ల దాడి నేపథ్యంలో రాహుల్ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు పేర్కొన్నారు.
టికాయిత్ కారుపై దాడి కేసులో ఏబీవీపీ(భాజపా విద్యార్థి విభాగం)కి చెందిన ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక భాజపానే ఉందని బీకేయూ ఆరోపిస్తోంది.
"సంఘ్.. వారికి దాడులు చేయడం నేర్పించింది. అహింస, సత్యాగ్రహం.. రైతులకు ధైర్యంగా ఉండటం నేర్పింది. వ్యవసాయ వ్యతిరేక, దేశ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించేంతవరకు మేమంతా కలిసి పోరాడతాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వందలాది మంది రైతులు.. దిల్లీ సరిహద్దులో గతేడాది నవంబర్ నుంచి నిరసిస్తున్నారు.
ఇదీ చూడండి:మహంత శకం ముగిసినట్లేనా?