ETV Bharat / bharat

ఆ రోజున 'బ్లాక్ డే' పాటించనున్న రైతులు

author img

By

Published : May 15, 2021, 4:27 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. అన్నదాతలు చేపట్టిన ఆందోళన 6 నెలలు పూర్తి కావొస్తోంది. ఈ సందర్భంగా మే 26న 'బ్లాక్ డే' జరపాలని నిర్ణయించింది సంయుక్త కిసాన్ మోర్చా.

Samyukta Kisan Morcha, May 26 as 'black day
సంయుక్త కిసాన్ మోర్చా, మే 26న 'బ్లాక్ డే'

మే 26ను 'బ్లాక్ డే' పాటించాలని పిలుపునిచ్చింది రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు చేపట్టిన ఆందోళన 6 నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఈ మేరకు శనివారం ప్రకటించింది.

మే 26న ప్రజలు తమ ఇళ్లు, వాహనాలు, షాపుల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అదే రోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని, నిరసనలో భాగంగా ప్రధాని దిష్టిబొమ్మ తగలబెట్టనున్నట్లు రాజేవాల్ చెప్పారు.

సాగు చట్టాలను నిరసిస్తూ.. నవంబర్ 26న రైతులు 'దిల్లీ చలో' కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై నీటి ఫిరంగులు, లాఠీఛార్జి చేశారు. దేశ రాజధాని చుట్టూ టిక్రి, సింఘు, గాజీపుర్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ' మోదీజీ.. గంగానది మీ వల్లే విలపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.