ETV Bharat / bharat

రైతుల్ని విడుదల చేయాలని రాష్ట్రపతికి లేఖ - సంయుక్త కిసాన్​ మోర్చా

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న క్రమంలో అరెస్టైన రైతుల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు సంయుక్త కిసాన్​ మోర్చా లేఖ రాసింది.

Samyukt Kisan Morcha writes to President, seeks unconditional release of arrested farmers
రాష్ట్రపతికి సంయుక్త కిసాన్​ మోర్చా లేఖ
author img

By

Published : Feb 25, 2021, 1:46 PM IST

నూతన సాగు చట్టాలపై పోరాడుతున్న క్రమంలో అరెస్టైన రైతుల్ని ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతికి సంయుక్త కిసాన్​ మోర్చా లేఖ రాసింది. వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది.

"కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని గత 6 నెలలుగా మేము ఉద్యమం చేస్తున్నాం. అయితే ఆందోళన చేస్తున్న రైతులపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్టు చేయించింది. వారంతా ఏ తప్పు చేయలేదు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతుల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించండి."

-రాష్ట్రపతికి లేఖలో సంయుక్త కిసాన్​ మోర్చా

దిల్లీలో మూసివేసిన రోడ్లను తెరవాలని రాష్ట్రపతిని కోరింది సంయుక్త కిసాన్ మోర్చా.

ఇదీ చూడండి: 'రైతుల మేలు కోసమే సాగు చట్టాలు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.