ETV Bharat / bharat

యూపీ సీఎం యోగి, ఎస్పీ అధినేత అఖిలేశ్​కు కరోనా - అఖిలేశ్​ యాదవ్​ కరోనా పాజిటివ్​

ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్​కు కూడా కరోనా సోకింది. ఈ ఇరువురూ.. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

akhilesh yadav , reported corona positive
ఎస్పీ అధినేత అఖిలేశ్
author img

By

Published : Apr 14, 2021, 12:39 PM IST

Updated : Apr 14, 2021, 1:41 PM IST

ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాల కారణంగా.. టెస్టు చేయించుకుంటే పాజిటివ్​గా తేలిందని ట్విట్టర్​లో తెలిపారు. వర్చువల్​గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు అధికారులకు మంగళవారం కరోనా సోకినట్లు తేలగా.. సీఎం ఐసోలేషన్​లోకి వెళ్లారు.

అఖిలేశ్​కు..

యూపీ మాజీ సీఎం, సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా​ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు.

akhilesh yadav , reported corona positive
అఖిలేశ్​ యాదవ్కు కరోనా

" నాకు కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్​లో ఉన్నాను. ఇటీవల నన్ను సంప్రదించినవారు కరోనా పరీక్షలు చేయించుకోండి."

-- అఖిలేశ్ యాదవ్, సమాజ్​వాదీ పార్టీ అధినేత

3 నెలల కిందట.. తాను కరోనా వ్యాక్సిన్​ తీసుకునే ప్రసక్తే లేదన్నారు అఖిలేశ్. భాజపా వ్యాక్సిన్​ను తాను తీసుకోబోనన్నారు.

టాండన్​కు కరోనా

ఉత్తర్​ప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అశుతోష్​ టాండన్​కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తెలిపారు. తనకు స్వల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నందున పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. ఇటీవల తనను సంప్రదించినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి : 'పాక్‌ రెచ్చగొడితే.. భారత్‌ స్పందన గట్టిగానే'

Last Updated : Apr 14, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.