ETV Bharat / bharat

శాలరీ నిలిపివేసిన హెడ్​మాస్టర్​పై హైకోర్టు గరం.. నెలరోజులు సస్పెండ్

Headmaster stopped salary: పాఠశాల ఉపాధ్యాయుడి వేతనాన్ని నిలిపివేసినందుకు ప్రధానోపధ్యాయుడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది కలకత్తా హైకోర్టు. జూన్ 8 వరకు స్కూల్​కు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లు పాటు ఉపాధ్యాయుడికి వేతనాన్ని అడ్డుకున్నారు హెడ్​మాస్టర్.

salary stopped by bengal headmaste
salary stopped by bengal headmaste
author img

By

Published : May 13, 2022, 10:32 PM IST

Headmaster stopped salary: పాఠశాల ఉపాధ్యాయుడి వేతనాన్ని రెండేళ్లపాటు నిలిపివేసిన ప్రధానోపాధ్యాయుడిపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. ఆయన్ను స్కూల్​లోకి ప్రవేశించకుండా నెలరోజుల పాటు నిషేధం విధించింది. హెడ్​మాస్టర్​ స్కూల్​లోకి రాకుండా చూసేందుకు ఇద్దరు సాయుధ పోలీసులను పాఠశాల వద్ద ఉంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది.

అసలేమైందంటే?
రాజు జానా అనే వ్యక్తి దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోలాబరిలోని పల్లిమంగల్ పాఠశాలలో 2013 నుంచి ఇంగ్లిష్ టీచర్​గా పనిచేస్తున్నారు. అయితే, 2018 డిసెంబర్ నుంచి 2020 డిసెంబర్ మధ్య ఆయనకు వేతనాన్ని నిలిపివేశారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ సఫీ ఆలం. అయితే, ఈ విషయంపై రాజు కలకత్తా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాఠశాలకు గైర్హాజరు కావడం వల్లే వేతనాన్ని నిలిపివేసినట్లు ఈ సందర్భంగా ఆలం చెప్పుకొచ్చారు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. సమాధానం లేకపోయేసరికి వేతనం ఆపేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మరోవైపు, తన వాదనలు వినిపిస్తూ.. హెడ్​మాస్టర్​కు స్థానికంగా పలుకుబడి ఉందని రాజు న్యాయస్థానం ముందు పేర్కొన్నారు. కాల్చేస్తానని తనను బెదిరించారని చెప్పారు. వెయ్యి మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు. తన హాజరుపట్టికలో వివరాలను వైట్​నర్​తో మార్చివేశారని ఆరోపించారు.

దీనిపై విచారణ చేపట్టిన దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్.. ప్రధానోపాధ్యాయుడిపై సీరియస్ అయ్యారు. 'పాఠశాల ఏమైనా మీ జమీందారీనా? ఉపాధ్యాయుడికి వేతనం మీరు చెల్లిస్తున్నారా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు చేతులు జోడించి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. జూన్ 8 వరకు పాఠశాలలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.

ఇదీ చదవండి:

42 ఏళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం.. టీచర్​కు 25 ఏళ్ల జీతం

గొడ్డలితో నరికి మేనమామ హత్య... తలతో ఊరంతా తిరిగి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.