ETV Bharat / bharat

ప్లాస్టిక్​ వ్యర్థాలతో మహాత్ముడి ప్రతిమ - ఉత్తర్​ప్రదేశ్​ బస్తీ జిల్లా వార్తలు

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ప్లాస్టిక్​ వ్యర్థాలతో గాంధీ బొమ్మ రూపొందించాడు.

safai karamchari uttar pradesh plastic, ప్లాస్టిక్​ వ్యర్థాలతో గాంధీ బొమ్మ యూపీ
ప్లాస్టిక్​ వ్యర్థాలతో మహాత్ముడి ప్రతిమ
author img

By

Published : Jun 15, 2021, 4:27 PM IST

ప్లాస్టిక్​ వ్యర్థాలతో మహాత్ముడి ప్రతిమ

ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లా భేడిహా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సూరజ్​.. వినూత్న రీతిలో తన ప్రతిభను చాటుకున్నాడు. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్​ను వేరు చేసి.. దానితో మహాత్మా గాంధీ ప్రతిమను రూపొందించాడు. నిజానికి ఈ ప్రతిమను సూరజ్​.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆవిష్కరించాల్సి ఉంది. అయితే పెయింట్​ పూర్తి కాకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం అని సూరజ్​ పేర్కొన్నాడు.

వ్యర్థాల నుంచి సూరజ్​ ప్లాస్టిక్​ను వేరు చేసి, పునర్వినియోగ కేంద్రాలకు విక్రయిస్తుంటాడు. అలా వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీకి విరాళంగా ఇస్తుంటాడు. ఇలా ఇప్పటివరకు రూ.17వేలు అందించాడు.

అలా సేకరించిన ప్లాస్టిక్​కు ఈసారి సిమెంట్​, ఇనుము, గోనె సంచుల జోడించి గాంధీ విగ్రహాన్ని రూపొందించాడు సూరజ్.

పల్లెకు హరితహారం...

గ్రామంలోని అనేక ప్రాంతాల్లో పూలమొక్కలను కూడా పెంచుతున్నాడు సూరజ్. అతడికి గ్రామ సర్పంచ్​ రూ.5,100 ప్రోత్సాహకంగా అందించారు. అయితే సూరజ్​ అందులో నుంచి రూ.4,100 గ్రామపంచాయతీకి విరాళంగా ఇచ్చాడని స్థానికులు చెప్పారు.

ఇదీ చదవండి : యువకుడి ప్రతిభ- సరసమైన ధరకే 'ఆక్సి-ఫ్లో మీటర్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.