ETV Bharat / bharat

సోనియాకు నడ్డా లేఖ.. కాంగ్రెస్​పై విమర్శలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దేశం విపత్తును ఎదుర్కొంటున్న వేళ.. కాంగ్రెస్​ ప్రవర్తన చూసి బాధ కలిగిందన్నారు. కానీ పార్టీ ప్రవర్తనతో ఆశ్చర్యపోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్​ నేతలు గందరగోళం సృష్టించడాన్ని మానుకుంటారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

Saddened, not surprised, by Congress' conduct during pandemic: BJP president J P Nadda to Sonia Gandhi after CWC's criticism of Modi govt
సోనియాకు నడ్డా లేఖ.. కాంగ్రెస్​పై విమర్శలు
author img

By

Published : May 11, 2021, 11:33 AM IST

Updated : May 11, 2021, 12:25 PM IST

కరోనాపై ఆందోళనలు సృష్టిస్తూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనాపై పోరులో మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నాలుగు పేజీల లేఖ రాశారు. దేశం విపత్తును ఎదుర్కొంటున్న వేళ కాంగ్రెస్​ పార్టీ వైఖరి చూసి బాధకలిగిందన్నారు. రాహుల్ గాంధీ సహా పార్టీలోని సీనియర్ నేతల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు.

"ఇలాంటి(కరోనా) పరిస్థితుల్లో.. కాంగ్రెస్​ ప్రవర్తన చూసి బాధ కలిగింది. కానీ వారి తీరు పట్ల నేను ఆశ్చర్యపోలేదు. ప్రజలకు సహాయం చేసేందుకు మీ పార్టీలో కొందరు తీవ్రంగా కృషి చేస్తుంటే.. వారి కష్టాన్ని మొత్తం నాశనం చేస్తూ కాంగ్రెస్​లోని కొందరు సీనియర్లు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. టీకాపై అనుమానాలు సృష్టించేందుకు ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రే ప్రయత్నించారు. ఇది సరైనది కాదు."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

మోదీ నాయకత్వంలో దేశం అత్యంత ధైర్యసాహసాలతో కరోనాపై యుద్ధం చేస్తోందని అన్నారు నడ్డా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​లోని అగ్రనేతలు ప్రజలను తప్పుదారిపట్టించడం మానుకోవాలని హితవు పలికారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వారి వైఖరిని మార్చుకునే అలవాటును పార్టీ నేతలు మార్చుకుంటారని ఆశిస్తునట్టు లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'సెంట్రల్​ విస్టా వ్యయంతో 62 కోట్ల టీకా డోసులు'

Last Updated : May 11, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.