Russian YouTuber Harassed In delhi : ఓ రష్యన్ మహిళా యూట్యూబర్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఘటన దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. లైవ్ స్ట్రీమింగ్‌లో ఆ యువకుడి చర్యలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదీ జరిగింది..
రష్యాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్‌కు 'కోకో ఇన్ ఇండియా' అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈమెకు హిందీ కూడా బాగా తెలుసు. భారత్‌లో రకరకాల ప్రదేశాలు తిరుగుతూ వ్లాగ్స్ చేస్తుంటుంది. అందులో భాగంగా దిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌కు వెళ్లింది. అనంతరం మార్కెట్ ప్రదేశాన్ని చూపిస్తూ లైవ్ ప్రారంభించింది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఓ యువకుడు వచ్చాడు. అనతంరం ఆ మహిళతో మాట్లాడటం మొదలుపెట్టి.. తన వీడియోలను రోజూ చూస్తుంటానని చెప్పాడు. అనంతరం 'నీతో స్నేహం చేయాలనుకుంటున్నా' అని చెప్పాడు. 'నాతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నారు' అని ఆ మహిళ అడిగింది. దానికి ఆ యువకుడు.. 'మీరు అందంగా ఉన్నారని.. అని చెప్పాడు. దీనికి.. 'తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు' అని మహిళ బదులిచ్చింది. అనంతంరం యువకుడు యూట్యూబర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే చివరకు, యువకుడు ఆ మహిళా యూట్యూబర్‌కు క్షమాపణ చెప్పాడని సమాచారం.
ఆకతాయిల అసభ్య ప్రవర్తన..
గతేడాది ముంబయిలోనూ ఇలాంటి ఘటన జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన మయోచి అనే మహిళ యూట్యూబర్ రాత్రి సమయంలో ముంబయిలోని రద్దీగా ఉన్న ఓ వీధిలో లైవ్‌స్ట్రీమ్ చేస్తోంది. ఆ సమయంలో అక్కడ వందల మంది తిరుగుతున్నారు. అప్పుడు ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడకు వచ్చి లిఫ్ట్ ఇస్తామంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగారు. ఆమెకు ఏమి చేయాలో అర్థం కాక 'ఇంటికి వెళ్లాలని' వారిని వారిస్తూ వెళ్లిపోబోయింది. అంతలో ఓ యువకుడు ఆమెని ముద్దుపెట్టుకోబోయాడు. అతడిని వదిలించుకొని మయోచి ముందుకు వెళ్లిపోయింది. అప్పటికీ ఆ యువకులు ఆమెను వదల్లేదు. ఓ స్కూటర్‌పై ఆమె వెనుకే వచ్చి మళ్లీ వాహనం ఎక్కాలంటూ బలవంతం చేశారు. కానీ, ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
విద్యా వాక్స్ ఆస్తి అన్ని రూ.కోట్లా? సంపాదన ఎంతో తెలిస్తే షాక్!