ETV Bharat / bharat

దేశాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన రష్యా అమ్మాయి, ఝార్ఖండ్ అబ్బాయి - Russian Navy officer

Indian Man Marries Russian: ఝార్ఖండ్​ హఝారిభాగ్​లో అరుదైన సంఘటన జరిగింది. రష్యాకు చెందిన ఓ మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు భారతీయుడు. వివాహానికి అమ్మాయి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కాగా అమ్మాయి రష్యా నేవీ అధికారి కూతురు.

.
.
author img

By

Published : Apr 21, 2022, 11:03 AM IST

Updated : Apr 21, 2022, 11:41 AM IST

Indian Man Marries Russian: పెళ్లికి కుల, మతాలే కాదు.. దేశాలు కూడా అడ్డుకాదని చాటి చెప్పింది ఓ ప్రేమ జంట. రష్యాకు చెందిన అమ్మాయిని.. ఝార్ఖండ్​ అబ్బాయి.. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లితో ఒక్కటయ్యారు. ఝార్ఖండ్​లోని హఝారిభాగ్​కు చెందిన అమిత్​ అభిషేక్​.. రష్యాకు చెందిన నేవీ అధికారి కూతురు సీన్యా ఎల్కినా కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు.. ఈ పెళ్లితో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

అభిషేక్​ ఉన్నత విద్యకోసం 2017లో రష్యాలోని సమర నగరానికి వెళ్లగా.. అక్కడ సీన్యాతో స్నేహం ఏర్పడింది. ఐదేళ్లుగా కొనసాగుతున్న వీరి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సీన్యా అభిషేక్​తో సహా భారత్​కు వచ్చి ఇక్కడ ఓ ప్రభుత్వ ప్రాజెక్ట్​లో ఉద్యోగం చేస్తోంది. అభిషేక్​, సీన్యా తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో భారతీయ సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి జరగ్గా.. సీన్యా కుటుంబ సభ్యులందరూ వివాహానికి హాజరయ్యారు.

Indian Man Marries Russian
వివాహానికి హాజరైన వధువు కుటుంబసభ్యులు

ఇదీ చదవండి: ప్రేమ కోసం పురుషుడిలా మారిన మహిళ.. చివరకు ఏమైందంటే?

Last Updated : Apr 21, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.