భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ దిల్లీ చేరుకున్నారు. అధికార పర్యటనకు దిల్లీ చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో లావ్రోవ్ భారత పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
#WATCH | Foreign Minister of Russia, Sergey Lavrov arrives in New Delhi for an official visit
— ANI (@ANI) March 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video Source: MEA Spokesperson Arindam Bagchi) pic.twitter.com/6kM1nJRYli
">#WATCH | Foreign Minister of Russia, Sergey Lavrov arrives in New Delhi for an official visit
— ANI (@ANI) March 31, 2022
(Video Source: MEA Spokesperson Arindam Bagchi) pic.twitter.com/6kM1nJRYli#WATCH | Foreign Minister of Russia, Sergey Lavrov arrives in New Delhi for an official visit
— ANI (@ANI) March 31, 2022
(Video Source: MEA Spokesperson Arindam Bagchi) pic.twitter.com/6kM1nJRYli
ఈ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశం కానున్నారు లావ్రోవ్. ద్వైపాక్షిక అంశాలు, సంబంధాల బలోపేతం సహా ఇతర కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.అయితే.. మీడియాకు విడుదల చేసిన అడ్వైజరీలో ప్రధాని మోదీ- లావ్రోవ్ మధ్య సమావేశం ఉందని ఎలాంటి సమాచారం లేదు. ఈ పర్యటనలో భారత్‌కు డెలివరీ చేయాల్సిన ఎస్-400 మిసైల్ వ్యవస్థ సహా వివిధ ఆయుధ సామగ్రిని అనుకున్న సమయానికి ఇవ్వాలని కోరనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
రెండు రోజుల పాటు చైనాలో పర్యటించిన అనంతరం భారత్‌కు వచ్చారు లావ్రోవ్. బ్రిటీష్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దిలీప్ సింగ్‌లు భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే లావ్రోవ్ రావటం గమనార్హం. గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటించారు.