ETV Bharat / bharat

'అమెజాన్​ అంటే.. ఈస్టిండియా కంపెనీ 2.0'

author img

By

Published : Sep 27, 2021, 6:32 AM IST

దిగ్గజ కంపెనీ అమెజాన్​పై ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ 'పాంచజన్య'(Rss Panchjanya ) వారపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అమెజాన్​ అంటే 'ఈస్టిండియా కంపెనీ 2.0' లాంటిదేనంటూ వ్యాఖ్యానించింది.

panchajanya
పాంచజన్య వార పత్రిక

ఆన్‌లైన్‌ చెల్లింపుల(ఈ-కామర్స్‌) రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ అమెజాన్‌ అంటే 'ఈస్టిండియా కంపెనీ 2.0' లాంటిదేనంటూ ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ 'పాంచజన్య'(Rss Panchjanya ) వారపత్రిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పై పెచ్చు ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా ఉండేలా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తోందంటూ సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్‌ 3న మార్కెట్​లోకి రానున్న తాజా సంచికలో ఈ వారపత్రిక(Rss Panchjanya ) 'అమెజాన్‌'పై ముఖచిత్ర కథనం ప్రచురించింది.

భారత్‌పై గుత్తాధిపత్యం కోసం 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ఏదైతే చేసిందో... ఇప్పుడు అమెజాన్‌ నడవడిలోనూ అవే ఛాయలు కనిపిస్తున్నట్లు ఆ వ్యాసంలో 'పాంచజన్య'(Rss Panchjanya ) పేర్కొంది. భారత మార్కెటుపై ఏకఛత్రాధిపత్యం సాధించేందుకు ఈ కంపెనీ మన పౌరుల వ్యక్తిగత, అర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అమెజాన్‌ వీడియో వేదిక 'ప్రైమ్‌ వీడియో'లో విడుదల అవుతున్న సినిమాలు, టీవీ సీరియళ్లు మన సంస్కృతికి విరుద్ధమని 'పాంచజన్య' ధ్వజమెత్తింది. ఈ కంపెనీ పరోక్షంగా పలు సంస్థలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా లంచాలు ఇస్తున్నట్లు పత్రిక పేర్కొంది.

ఇదీ చూడండి: Rahul Gandhi news: 'భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు హిందువులే కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.