సరదాగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే.. మురిసిపోతాం కదా! ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయో లెక్కేసుకుని మరీ సంబరపడిపోతాం. కానీ ఇలా వైరల్ అయిన వీడియో ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్లోని యువకులకు మాత్రం కొత్త తంటాలు తెచ్చి పెట్టింది. వీడియో ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు వారికి రూ.12,000 జరిమానా విధించారు.
ఆ వీడియోలో నలుగురు యువకులు ఒకే బైక్పై ప్రయాణిస్తుంటారు. అప్పటికే ఇరుకుగా కూర్చుని పోతుండగా.. దారి మధ్యలో మరొక యువకుడు లిఫ్ట్ అడుగుతాడు. బైక్పై స్థలం లేకపోవటంతో.. లిఫ్ట్ అడిగిన యువకున్ని ఆ నలుగురు యువకులు చేతుల్లో పట్టుకుని నిర్లక్ష్యంగా ప్రయాణిస్తారు. ఇలా ఐదుగురు ఒకే బైక్పై వెళ్తారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు యువకులు ప్రయాణించిన బైక్ నెంబర్ ఆధారంగా రూ.12,000 జరిమానా విధించారు.
ఇదీ చదవండి: సిగరెట్టుకు డబ్బులు అడిగారని కొట్టి చంపేశారు!