ETV Bharat / bharat

రైలులో రూ.1.4 కోట్లు వదిలేసి... - భారతీయ రైల్వే

స్వతంత్ర సంగ్రామ్ సేనాని ఎక్స్​ప్రెస్​ నుంచి కాన్పుర్​ రైల్వే పోలీసులు రూ.1.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.

up train
రైలులో రూ.1.4 కోట్లు లభ్యం!
author img

By

Published : Feb 17, 2021, 1:24 PM IST

దిల్లీ నుంచి బిహార్​లోని జయనగర్​కు ప్రయాణిస్తున్న స్వతంత్ర సంగ్రామ్​ సేనాని ఎక్స్​ప్రెస్​ నుంచి అధికారులు రూ.1.4 కోట్ల నగదు ఉన్న బ్యాగ్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ​

రైలు సోమవారం రాత్రి ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్ చేరుకున్న సమయంలో పాంట్రీ కారులో ఈ బ్యాగు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. నగదును లెక్కించే వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మంగళవారం రాత్రి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.

"ఇప్పటివరకు బ్యాగ్​ గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తదుపరి చర్యలు ఆదాయ పన్ను శాఖ అధికారులు చేపడతారు."

-రైల్వే అధికారులు ​ ​

ఇదీ చదవండి : వాతావరణ మార్పుపై భారత్​-బ్రిటన్​ చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.