RRC WCR Apprentice Jobs 2023 : పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు శుభవార్త. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 3,015 అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని యూనిట్‌లలో శిక్షణ కోసం ఆసక్తిగల ఆశావాహులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు (RRC WCR Apprentice Jobs Eligibility)
పదో తరగతితో పాటు ఐటీఐ సంబంధిత ట్రేడ్‌లో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు (RRC WCR Apprentice Jobs Trades)
- మెకానిక్
- అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్
- అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్
- బ్లాక్‌స్మిత్
- బుక్ బైండర్
- కేబుల్ జాయింటర్
- కార్పెంటర్
- కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్
- డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
- డీజిల్ మెకానిక్
- డిజిటల్ ఫొటోగ్రాఫర్
- డ్రాఫ్ట్స్‌మ్యాన్
- ఎలక్ట్రీషియన్
- ఫిట్టర్
- హౌస్ కీపర్
- మెషినిస్ట్
- మాసన్
- పెయింటర్
- ప్లంబర్
- స్టెనోగ్రాఫర్
- టర్నర్
- వెల్డర్
- వైర్‌మ్యాన్
ఈ డివిజన్ లేదా యూనిట్లు (RRC WCR Apprentice Vacancy Divisions)
- జేబీపీ డివిజన్
- బీపీఎల్ డివిజన్
- కోటా డివిజన్
- సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్
- డబ్ల్యూఆర్‌ఎస్ కోటా
- హెచ్‌క్యూ/ జేబీపీ
ఏజ్ లిమిట్!
RRC WCR Apprentice Jobs Age Limit : 2023 డిసెంబర్ 14 నాటికి అభ్యర్థులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం(RRC WCR Apprentice Jobs Selection Process)
- పదో తరగతి మార్కులు
- ఐటీఐ మార్కులు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు(RRC WCR Apprentice Jobs Application Fees)
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.36
- మిగతా కేటగిరీల అభ్యర్థులకు రూ.136ను దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు(RRC WCR Apprentice Jobs Important Dates)
- దరఖాస్తు ప్రారంభం తేదీ : 2023 డిసెంబర్ 15
- దరఖాస్తు చివరి తేదీ : 2024, జనవరి 14
అధికారిక వెబ్సైట్!
RRC WCR Official Website : నోటిఫికేషన్‌కి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆర్ఆర్సి డబ్ల్యూసీఆర్ అధికారిక వెబ్సైట్ https://wcr.indianrailways.gov.in/ను చూడవచ్చు.
అప్లై చేసుకోండిలా(RRC WCR Apprentice Jobs Apply Online)
- ముందుగా ఆర్‌ఆర్‌సీ డబ్ల్యూసీఆర్ అధికారిక వెబ్సైట్ https://wcr.indianrailways.gov.in/లోకి లాగిన్ అవ్వండి.
- హోమ్‌పేజీపై కనిపించే 'Engagement of Act Apprentice Online Application' లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు అడిగిన వివరాలు అందించి రిజిస్టర్ అవ్వండి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్‌లో కూడా కావాల్సిన వివరాలను నింపండి.
- దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అనంతరం అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
- ఒకసారి వివరాలను చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ నొక్కండి. దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
- ముందుజాగ్రత్తగా అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని భద్రపరుచుకోండి.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్- ఐటీఐ అర్హతతో రైల్వేలో 3093 అప్రెంటీస్ జాబ్స్
ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?