ETV Bharat / bharat

రోబోలతో దీపావళి వేడుకలు.. దీపాలు వెలిగిస్తూ.. టపాసులు కాలుస్తూ హంగామా

author img

By

Published : Oct 25, 2022, 6:40 PM IST

సాధారణంగా దీపావళి పండుగను కుటుంబంతోనో.. బంధువులతోనో.. చుట్టుపక్కల వారితోనో జరుపుకుంటాం. కానీ వీళ్లు మాత్రం ఈ దీపావళిని వినూత్నంగా జరుపుకొన్నారు. నాలుగు రోబోలతో పండగను జరుపుకొని సరికొత్త అనుభూతిని ఆస్వాదించారు.

diwali celebration with robots
diwali celebration with robots

రాజస్థాన్​ జైపుర్​కు చెందిన గుల్మోహర్ గార్డెన్ సొసైటీ వాసులు దీపావళిని వినూత్నంగా జరుపుకొన్నారు. రోబోలతో కలిసి టపాసులను కాలుస్తూ, దీపాలను వెలిగిస్తూ జరుపుకొన్నారు. రోబోలు.. సొసైటీ వాసులతో కరచాలనం చేస్తూ, అతిథులను ఆప్యాయంగా పలకరిస్తూ వేడుకలను మరింత ఆహ్లాదకరంగా చేశాయి. ఈ రోబోలు అత్యవసర పరిస్థితుల్లో మంటలను ఆర్పడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం వంటి పనులను ఇవి సమర్థంగా చేయగలవని రోబోటిక్ నిపుణులు భువనేశ్ మిశ్రా చెప్పారు. సొసైటీలోని ఈ నాలుగు రోబోలు కెఫటేరియాలో ఆహారం అందించే పనులతో పాటు ఇతర అనేక పనులను చేయడంలో సహాయపడుతాయన్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న రోబోలలో షేనా 5.0 ఆల్ టెరైన్ రోబో, షేనా 6.0 సోలార్ మ్యాన్​హోల్ క్లీనింగ్ రోబో, సోనా 3.5 ఏఐ హ్యూమనాయిడ్ రోబో, సోనా 2.5 సర్వీస్ మెన్ రోబోలు ఉన్నాయి. జైపుర్​కు చెందిన క్లబ్ ఫస్ట్ రోబోటిక్ సంస్థ ఈ రోబోలను తయారు చేసింది.

diwali celebration with robots
ఆహార పదార్థాలు అందిస్తున్న రోబో
diwali celebration with robots
డ్రైనేజీ శుభ్రం చేస్తున్న రోబో
diwali celebration with robots
అగ్నిమాపక రోబో

"మనమందరం దీపావళిని కుటుంబాలతో ఆనందంగా జరుపుకుంటాం, అదే ఎల్లప్పుడు మన క్షేమం కోసం పనిచేసే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మాత్రం వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రోబోలు వారికి బాసటగా నిలుస్తాయి."

భువనేశ్ మిశ్రా, రోబోటిక్ నిపుణులు

సోనా 2.5 రోబో కెఫటెరీయాలో ఆహార సేవలను అందిస్తుంది. సోనా 3.5 ఫిర్యాదులను నమోదు చేసి.. సొసైటీకి సంబంధించిన ప్రశ్నలకు బదులిస్తూ తన అభిప్రాయాలను అందజేస్తుంది. షేనా 5.0 రోబోను ఆర్మీ ట్యాంక్ తరహాలో రూపొందించారు. ఇది సొసైటీ రక్షణ కోసం రూపొందించిన శక్తిమంతమైన రోబో. ఉత్సవాల సమయంలో ఈ రోబో గార్డు విధులను నిర్వర్తిస్తుంది. అగ్నిమాపక వ్యవస్థను యాక్టివేట్ చేయడం, తోటకు నీరు పోయడం, వీడియో రూపంలో నిఘా నిర్వహించడం వంటి పనులు చేస్తుంది. తప్పుగా పార్క్ చేసిన వాహనాలను తొలగించాలని సంకేతాలు సైతం ఇస్తుంది. షేనా 6.0 రోబో సౌరశక్తితో పనిచేస్తుంది. ఈ రోబోలో జీపీఎస్, గ్యాస్ డిటెక్షన్ అలారం వంటివి అమర్చి ఉంటాయి. లోతైన మ్యాన్‌హోల్స్, డ్రైనేజీ లైన్‌లను శుభ్రం చేయడం దీని విధి.

diwali celebration with robots
రోబోతో నిపుణులు

ఇవీ చదవండి: రైలు లక్ష్యంగా బాంబు.. ఆడుకుంటూ వెళ్లి డబ్బా తెరిచిన పిల్లలు.. ఏడేళ్ల బాలుడు మృతి

ఇదేం తిక్కరా నాయనా.. లక్ష టపాసులతో కారును అలంకరించి.. మంట పెట్టి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.