ETV Bharat / bharat

వెయిటర్​గా వయ్యారాల రోబో సుందరి.. చిటికెలో ఆర్డర్ డెలివరీ! - వెయిటర్​గా రోబో

Robot Waiter in Restaurant: ఏ హోటల్​కు వెళ్లి కూర్చున్నా.. 'ఏం కావాలి' అని వెయిటర్ ప్రశ్నిస్తారు. కానీ కర్ణాటకలో ఓ హోటల్​కు వెళితే.. మనిషిలాగే ఉన్న ఓ రోబో సుందరిని కలవాల్సి ఉంటుంది. సంప్రదాయ చీరకట్టు, ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న ఈ రోబో సుందరి కథేంటో చూసేద్దాం పదండి..!

robo waiter
వెయిటర్​గా రోబో సుందరి
author img

By

Published : Feb 17, 2022, 2:44 PM IST

హోటల్​లో వెయిటర్​గా పనిచేస్తున్న రోబో

Robot Waiter in Restaurant: మనం ఎక్కడైనా హోటల్​కు వళ్తే.. వెయిటర్ మన దగ్గరికి వస్తాడు. ఏం కావాలో చెబితే అతడు తెచ్చి ఇస్తాడు. కానీ కర్ణాటక మైసూర్​లోని సిద్ధార్థ హోటల్​కు వెళ్తే.. మీరు ముందు 'రోబో సుందరి'ని కలవాలి. మీకు ఏం కావాలో దానికి చెబితే క్షణాల్లో తెచ్చేస్తుంది. సర్వర్​గా సేవలు చేస్తున్న ఈ రోబో ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా పేరుగాంచింది. ​

robo waiter
వెయిటర్​గా రోబో సుందరి

మైసూర్​లో​ పేరుపొందిన హోటల్ సిద్ధార్థ. నిత్యం వెయిటర్​​ల కొరత యాజమాన్యాన్ని వేధిస్తోంది. దీంతో ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వెయిటర్​ల స్థానంలో ఓ హ్యూమనాయిడ్​ రోబోను నియమించారు. రూ.2.5 లక్షలు ఖర్చు చేసి దిల్లీలోని ఓ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. కస్టమర్లు హోటల్​కు రాగానే ఆహారపదార్థాల మెనూను చూపిస్తుంది ఈ రోబో. వాయిస్ కమాండ్​లను ఆనుసరించే విధంగా ఇందులో ప్రీ- ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా పనిచేసే విధంగా బ్యాటరీ ఉంటుంది. ఒకేసారి పది కేజీల వరకు బరువును అలవోకగా మోయగలదు. హోటల్​లో టేబుల్స్ మధ్య సౌకర్యవంతంగా కదలడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. సంప్రదాయ చీరకట్టు, ఒంటినిండా నగలతో ఈ రోబో సేవలు అందిస్తుంటే కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోబోను ఆపరేట్​ చేయడంలో హోటల్ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. టెక్నికల్ సమస్యలు ఎదురైనప్పుడు తయారీ సంస్థ అనుసంధానంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ రోబో ఆలోచన సక్సెస్​ అయితే.. మరో నాలుగు రోబోలను తెప్పిస్తామని చెబుతున్నారు.

ఇదీ చదవండి: వృథాగా ఉన్న రైలు బోగీలో ఆఫీస్.. ఏం ఐడియా గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.