ETV Bharat / bharat

108 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం.. బాత్​రూమ్​కు తీసుకెళ్లి.. కాళ్లు నరికి.. - మైనర్​పై అత్యాచారం

రాజస్థాన్​లో దారుణం జరిగింది. 108 ఏళ్ల వృద్ధురాలి కాళ్లు నరికి ఆమె వెండి కడియాలను ఎత్తుకెళ్లారు దుండగులు. మరోవైపు, తన మాజీ భార్య మరొకరిని వివాహం చేసుకోవడం నచ్చని ఓ వ్యక్తి హత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటన బంగాల్​లో వెలుగుచూసింది.

jaipur loot case
వృద్ధురాలిపై దాడి
author img

By

Published : Oct 9, 2022, 5:18 PM IST

రాజస్థాన్​ జైపుర్​లో దారుణం జరిగింది. 108 ఏళ్ల వృద్ధురాలి కాళ్లను నరికి వెండి కడియాలను ఎత్తుకెళ్లిపోయారు దుండగులు . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు జైపుర్​లోని బస్ బదన్​పురామీనా కాలనీలో ఈ ఘటన జరిగింది. వృద్ధురాలు జమునా దేవి.. తన ఇంటి వరండాలో ఉన్న సమయంలో దుండగులు ఆమెను బాత్​రూమ్​లోకి లాక్కెళ్లారు. అనంతరం బాధితురాలి కాళ్లను నరికేసి వెండి కడియాలను ఎత్తుకెళ్లిపోయారు. గుడికి వెళ్లిన బాధితురాలి కుమార్తె ఇంటికి వచ్చింది. హుటాహుటిన తల్లిని ఎస్​ఎమ్​ఎస్​ ఆస్పత్రికి తరలించింది. వృద్ధురాలిపై దాడికి నిందితులు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

పదునైన ఆయుధంతో..
బంగాల్​లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో దారుణం జరిగింది. మాజీ భర్త.. ఓ మహిళ ప్రస్తుత భర్తపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితుడు బిశ్వజిత్ బిస్వాస్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడు సుకాంత భద్రను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..
రింకూ, సుకాంత భార్యాభర్తలు. వీరిద్దరూ ఎనిమిదేళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. ఈ ఏడాది మే 25న బిశ్వజిత్​ అనే వ్యక్తిని రింకూ వివాహమాడింది. ఇది నచ్చని సుకాంత పదునైన ఆయుధంతో.. బిశ్వజిత్ తల, మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితుడు బిశ్వజిత్ అరుపులు విన్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

పెట్రోల్ పోసి..
15 ఏళ్ల మైనర్​ను గర్భవతిని చేసి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్ మెయిన్​పురిలో జరిగింది. సెప్టెంబరు 6న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందుతుడిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలిపై మూడు నెలల క్రితం వరుసకు అన్నయ్య అయ్యే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయ్యింది. ఈ విషయం నిందితుడి కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల బాధితురాలిని బెదిరించారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి: దిల్లీలో దంచికొడుతున్న వాన.. దశాబ్దంలోనే రికార్డు స్థాయి వర్షపాతం

డీఎంకే అధ్యక్షునిగా స్టాలిన్​.. వరుసగా రెండోసారి ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.