Road Accident Several Dead: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కడప ఆజాద్ నగర్ కాలనీవాసులు ఆటోలో వెళ్తుండగా ఎర్రగుంట్ల మండవం పోట్లదుర్తి సమీపంలో వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ను ఓవర్టేక్ చేస్తుండగా.. సెవెన్ సీటర్ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రయాణిస్తున్నారు. మృతులను మహమ్మద్(25), హసీనా(25), అమీనా(20), షాకీర్(10)గా గుర్తించారు.కళ్లెదుటే తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు పోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలు పైబడి వారు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Road Accident Several Dead: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి.. - వైఎస్సార్ జిల్లాలో ఆటో ప్రమాదం న్యూస్
Published : Oct 9, 2023, 9:18 AM IST
|Updated : Oct 9, 2023, 12:43 PM IST
09:14 October 09
ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం