ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. 15 మందికి గాయాలు - ఉత్తర్​ప్రదేశ్​ రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించగా 15 మంది గాయపడ్డారు.

road accident in uttarpradesh Bahraich
road accident in uttarpradesh Bahraich
author img

By

Published : Nov 30, 2022, 8:20 AM IST

Updated : Nov 30, 2022, 9:07 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రాయిచ్​లో బస్సును ఓ భారీ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.

ఉదయం సుమారు నాలుగున్నర సమయంలో లఖ్​నవూ బహ్రాయిచ్​ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని లఖ్​నవూలోని ట్రామా సెంటర్​కు రెఫెర్​ చేశామన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్​ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.. దగ్గరగా ఉన్న డాబాల్లోని సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచు తీవ్రంగా కమ్ముకోవడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండచ్చొని అనుమానిస్తున్నారు.

Last Updated : Nov 30, 2022, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.