ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం- ఐదుగురు దుర్మరణం - road accident news today

Road Accident In Odisha: వివాహానికి వెళ్లి వస్తుండగా.. లారీ, ఎస్​యూవీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని సువర్ణ్​పుర్​ జిల్లాలో జరిగింది.

Road Accident in Odisha
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 22, 2022, 11:37 AM IST

Road Accident In Odisha: ఒడిశా సువర్ణ్​పుర్​ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్​యూవీని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

జిల్లాలోని నిమ్న గ్రామానికి చెందిన పది మంది.. సమీప గ్రామంలో వివాహానికి హాజరై తిరుగుప్రయాణమయ్యారు. శనివారం అర్ధరాత్రి వారు ప్రయాణిస్తున్న ఎస్​యూవీని అకస్మాత్తుగా ఓ లారీ ఢీకొట్టింది. ఇందులో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన మరో ఐదుగురిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.