Road Accident in Nalgonda District Five People Died : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును ఢీకొని కారు పల్టీ కొట్టింది. ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురు మృతి చెందగా.. కారులో ఉన్న ఇద్దరు చనిపోయారు. హైదరాబాద్ నుంచి అక్కంపల్లి వస్తున్న బైకును కారు ఢీకొట్టడంతో ఘటన స్థలంలో మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు అవినాష్ (12) ఇద్దరు మృతిచెందారు. బైకుపై ఉన్న మహిళ, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు.
Adilabad Lorry Accident Viral Video : కంటైనర్ బీభత్సం.. లారీ.. బైక్.. ఆటో.. ఆగేదే లే అన్నట్లుగా..
Five People Died in Bike and Car Accident : క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పట్నపు మణిపాల్ (18) అనే వ్యక్తి చనిపోాయరు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో వనం మల్లికార్జున్ (12), మద్దిమడుగు రమణమ్మ(35) కూడా మృతి చెందారు. బైకుపై వస్తూ ప్రమాదానికి గురైన వారు పెద్ద అడిసర్లపల్లి మండలం అక్కంపల్లి గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్నావారు చింతపల్లి మండలం గుర్రంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bus Accident In Muktsar : కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు
Warangal Khammam Highway Accidents : ఈ హైవే వైపు వెళ్తున్నారా.. బీ కేర్ఫుల్ బ్రో..!