ETV Bharat / bharat

జీపుపై విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి - జీపుపై కొండచరియలు విరిగిపడ్డాయి

హిమాచల్​ ప్రదేశ్​ మండి జిల్లాలో ఓ జీపుపై కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.

Road accident
హిమాచల్​ప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 21, 2021, 5:20 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. మండి జిల్లా సిరాజ్​ ప్రాంతంలోని కల్హానిలో ఓ జీపుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వాహనం లోయలో పడిపోయింది.

శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిని స్థానికులు కాపాడారు. వారిలో నలుగురు దుర్మరణం చెందారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరో 4-6 మంది శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి

తన స్వస్థలానికి సమీపంలో ఘోర ప్రమాదం జరగటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్​. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్​ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. స్థానిక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు.

Road accident
ముఖ్యమంత్రి ట్వీట్​

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాదంలో 54కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.