ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని సచేందీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ, బస్సు ఢీ కొని 17 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. బస్సు.. లఖ్నవూ నుంచి దిల్లీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
కాన్పుర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.