ETV Bharat / bharat

లారీ, కారు ఢీకొని ఐదుగురు మృతి.. ఓల్డేజ్ హోమ్​లో ఇద్దరు సజీవదహనం - రాజస్థాన్​ హనుమాన్​గఢ్​ రోడ్డు ప్రమాదం

ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న లారీ ఓ కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Road accident in Hanumangarh
Road accident in Hanumangarh
author img

By

Published : Jan 1, 2023, 9:38 AM IST

Updated : Jan 1, 2023, 11:01 AM IST

రాజస్థాన్​లో దారుణం జరిగింది. కారు, లారీ ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. హనుమాన్​ గఢ్​ జిల్లా పల్లూ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది.. ఇటుకల లోడుతో వస్తున్న లారీ.. బిస్రాసర్​ అనే గ్రామ సమీపంలో బలంగా కారును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్​ అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న డ్రైవర్​ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత.. మృతదేహాలకు పోస్టుమార్ట పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

ఓల్డేజ్​ హోమ్​లో మంటలు.. ఇద్దరు మృతి
ఓల్డేజ్​ హోమ్​లో అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్థులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన దక్షిణ దిల్లీలోని గ్రేటర్​ కైలాశ్​ ప్రాంతంలో ఆదివారం జరిగింది. గాయపడిన దాదాపు డజను మందిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన గురించి ఉదయం 5.14 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత.. మూడో ఫ్లోర్​లో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. క్రైం, ఫోరెన్సిక్​ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Last Updated : Jan 1, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.