ETV Bharat / bharat

ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు విద్యార్థులు మృతి.. రాజస్థాన్​లో మరో ఐదుగురు.. - రోడ్డు ప్రమాదం ఛత్తీస్​గఢ్

road accident in Chhattisgarh
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 9, 2023, 5:28 PM IST

Updated : Feb 9, 2023, 10:49 PM IST

17:21 February 09

ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు విద్యార్థులు మృతి.. రాజస్థాన్​లో మరో ఐదుగురు..

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకేర్ జిల్లాలోని కోరేర్​ సమీపంలో విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరో విద్యార్థి, ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కోరేర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుల వయసు 5 నుంచి 7 సంవత్సరాలలోపే ఉంటుందని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు చిన్నారులు ఆస్పత్రికి తీసుకువెళ్లాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా స్కూల్​ సెలవులు ముగించుకుని తిరిగి పాఠశాలకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ అవినాశ్​ ఠాకుర్​ తెలిపారు. ప్రస్తుతం పరారిలో ఉన్న ట్రక్కు డ్రైవర్​ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. మరోవైపు.. ఈ రోడ్డు ప్రమాదంపై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన ట్వీట్​ చేశారు.

ఐదుగురు మృతి..
రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం బైక్​ను ఢీకొట్టగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం రాజ్​సమంద్​ జిల్లాలోని భీమ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో గురువారం జరిగింది.

ఐదుగురు వ్యక్తులు బైక్​పై వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి వారిని ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతులను భన్వర్ సింగ్ (35), అజయ్ సింగ్(14), లీలా(17), షైతాన్ సింగ్(14), ఉష(16)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Last Updated : Feb 9, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.