Road Accident in Ahmedabad Today : గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. మినీ ట్రక్కు-లారీ ఢీకొన్న ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై బగోదర గ్రామంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
వేగంగా వెళుతున్న మినీ ట్రక్కు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే.. ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు వారు వివరించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి..
Himachal Pradesh Accident Today : బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు పోలీసులతో పాటు ఓ డ్రైవర్ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Six Police Died Road Accident : తీసా నుంచి బైరాగఢ్ వెళుతున్న బొలెరో వాహనం.. అకస్మాత్తుగా అదుపుతప్పి లోయలో పడింది. ఆ లోయ దాదాపు 100 మీటర్ల లోతు ఉంటుంది. తర్వాయి ప్రాంత సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు.
ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రమాద సూచిక బోర్డులు నేల కూలయాని.. దీంతో ప్రయాణికులకు హెచ్చరికలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా ఇదే రోడ్డు మార్గంలో చాలా ప్రమాదాలు జరిగాయని వారు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.
గ్యాస్ లీక్.. స్కూల్లో స్పృహతప్పి పడిపోయిన 24 మంది పిల్లలు
మర్డర్ కేసును ఛేదించిన పోలీస్ డాగ్ 'తార'.. 8 కి.మీ రన్నింగ్ చేసి మరీ నిందితుడి గుర్తింపు