ETV Bharat / bharat

'కాంగ్రెస్ బలోపేతంపై తొందరపాటుతో అనర్థం' - పీకే తాజా వార్తలు

లఖింపుర్ ఖేరి ఘటనపై ఉద్యమించడం ద్వారా.. కాంగ్రెస్​ బలోపేతం అవుతుందని అశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor Congress) పేర్కొన్నారు. అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్​ పునరుత్థానం సాధించలేదని చెప్పారు. ప్రశాంత్ కిశోర్​ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్​.. 'లఖింపుర్ ఖేరి వంటి ఘటనల్లో లాభనష్టాలను వెతికితే.. నేరం చేసినట్లే' అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Prashant Kishor
ప్రశాంత్ కిశోర్
author img

By

Published : Oct 9, 2021, 6:52 AM IST

Updated : Oct 9, 2021, 9:19 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని అశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor Congress) హెచ్చరించారు. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పునరుత్థానం సాధించలేదని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.

పార్టీ వేళ్లూనుకున్న సమస్యలను ఇప్పటికిప్పుడు అధిగమించడం అంతతేలిక కాదని ప్రశాంత్ కిశోర్​(Prashant Kishor Congress) స్పష్టంచేశారు. సోనియా కుటుంబంతో మంతనాలు జరుపుతున్న ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లఖింపుర్‌ ఖేరి ఉదంతంపై ప్రశాంత్‌ తాజా ట్వీట్‌ను చూస్తే, ఆయనకూ, కాంగ్రెస్‌ అగ్రనేతల కుటుంబానికీ మధ్య సంబంధాలు సజావుగా లేవన్న అనుమానాలు కలుగుతున్నాయి.

'లాభనష్టాలు వెతకడం నేరం'

ప్రశాంత్ కిశోర్​ వ్యాఖ్యలపై(Prashant Kishor Congress) కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. లఖింపుర్​ ఖేరి ఘటన వంటి సున్నితమైన అంశాల్లో లాభనష్టాలను వెతుక్కోవడం నేరమని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా..​ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

"రాజకీయ సలహాదారుల వ్యాఖ్యలపై నేను ఏం స్పందించాలనుకోవడం లేదు. అయితే.. లఖింపుర్ ఘటన వంటి వాటిలో లాభనష్టాల కోసం వెతకడం అంటే.. పెద్ద నేరం చేసినట్లే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలపైన నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. కానీ, రాజకీయ పార్టీలు ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని కోరుతున్నాను" అని సుర్జేవాలా తెలిపారు.

మరోవైపు.. "జాతీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయంగా మారే క్రమంలో లోతైన, సంఘటిత ప్రయత్నాలు అవసరం. వేగవంతమైన పరిష్కారాలు అవసరం లేదు" అని ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ తెలిపారు.

లఖింపుర్​లో ఏం జరిగింది?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడికి చెందిన వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రమంత్రి రాజీనామా చేయాలని, ఆయన తనయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఘటనా స్థలానికి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని నిర్బంధించడం, రాహుల్‌ను అడ్డుకోవడం.. ఆ తర్వాత అనుమతి ఇవ్వడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ సమయంలో ప్రశాంత్‌ కిశోర్ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: లఖింపుర్​కు సిద్ధూ మార్చ్​- నిర్బంధించిన పోలీసులు

ఇదీ చూడండి: 'కాంగ్రెస్ విఫలం కావడం వల్లే.. ఆ బాధ్యత మాపై పడింది '

Last Updated : Oct 9, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.