మధ్యప్రదేశ్ రీవాలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఐదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్ షేర్ చేశాడు(rewa news). దీంతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అతడిపై కఠిన చర్యలు తీసకోవాలని జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పాఠశాల ఐదో తరగతి వాట్సాప్ గ్రూప్‌లో జిల్లాలోని 28 స్కూళ్లకు చెందిన 180మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు 65 మంది మహిళా టీచర్లు సభ్యులుగా ఉన్నారు. అశ్లీల లింక్ షేర్ చేసిన ఉపాధ్యాయుడు కృపాకర్ చతుర్వేదిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ గ్రూప్‌లో కృపాకర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 30మంది ఉన్నారు. మిగతా వారు ఇతర స్కూళ్లకు చెందినవారు(rewa techer news).
పోర్న్ లింక్ షేర్ చేసిన కాసేపటికి దాన్ని తొలగించాడు కృపాకర్. పొరపాటున తాను తప్పు చేశానని, మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటానని సోషల్ మీడియా వేదికగా క్షమాణలు చెప్పాడు. గ్రూప్‌లోని ఇతర సభ్యుడు చెప్పేవరకు లింక్ షేర్ చేసిన విషయం తనకు తెలియదన్నాడు.
అయితే కృపాకర్ ఇలా చేయడం కొత్తేం కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి లింక్‌లు షేర్ చేశాడని గ్రూప్‌లోని మరో టీచర్ ఆరోపించారు. అతడ్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కృపాకర్‌పై తమకు ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు(madhya pradesh rewa).
ఇదీ చదవండి: భార్యకు ప్రేమతో.. అచ్చం తాజ్‌మహల్ లాంటి ఇల్లు కానుక