ETV Bharat / bharat

2020-21లో తత్కాల్​ ద్వారా రైల్వేకు రూ.500 కోట్లు

author img

By

Published : Jan 2, 2022, 5:33 PM IST

Revenue From Tatkal: 2020-21 సంవత్సరంలో తత్కాల్​, ప్రీమియం తత్కాల్​ టికెట్ల ద్వారా రూ.500 కోట్లుపైగా ఆదాయం వచ్చినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్​కు చెందిన చంద్రశేఖర్​ గౌర్​ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు అందజేసింది.

tatkal revenue
తత్కాల్​ రెవెన్యూ

Revenue From Tatkal: మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా రైల్వేకు భారీగానే ఆదాయం సమకూరింది. 2020-21 సంవత్సరంలో రైల్వే.. తత్కాల్​, ప్రీమియం తత్కాల్​, డైనమిక్​ ఛార్జీలతో కలిపి మొత్తం రూ.1033 కోట్లు వసూలు చేసింది. వీటిలో తత్కాల్​ టికెట్ల ద్వారా రూ. 403 కోట్లు, ప్రీమియం తత్కాల్​ ద్వారా రూ. 119 కోట్లు, డైనమిక్​ ఛార్జీలకు రూ.511 కోట్లు వచ్చాయి. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్​కు చెందిన చంద్రశేఖర్​ గౌర్​ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

గతేడాది ఏప్రిల్​ నుంచి సెప్టెంబరు మధ్యలోనే తత్కాల్​ టికెట్ల ద్వారా రూ.353 కోట్లు, ప్రీమియం తత్కాల్​ ద్వారా రూ.89 కోట్లు, డైనమిక్​ ఫేర్స్​ ద్వారా రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. ఎలాంటి ఆంక్షలు లేని 2019-20 ఆర్థిక సంవత్సరంలో తత్కాల్​, ప్రీమియం తత్కాల్​, డైనమిక్​ ఫేర్స్​ ద్వారా రూ. 3585 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది.

తత్కాల్​ టికెట్లకు రెండో తరగతి టికెట్​ ధరపై 10 శాతం, ఇతర తరగతుల టికెట్​ ధరపై 30 శాతం వసూలు చేస్తోంది రైల్వే.

ఇదీ చూడండి : 'నేరస్థులతో జైళ్లలో ఆటాడుకుంటున్న యోగి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.