Revanth Reddy Swearing Ceremony Time Changed : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. ఎల్బీ స్టేడియంలో గురువారం రోజున జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చేశారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తొలుత గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణస్వీకారం చేయడానికి ముహుర్తం నిర్ణయించగా తాజాగా మధ్యాహ్నం 1.04 గంటలకు మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు రానున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, తదితర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
-
Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic
">Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8IcCongratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic
Revanth Reddy Swearing Ceremony Guests List : మరోవైపు దిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఏఐసీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం 50 నిమిషాల పాటు సాగింది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలను రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. వారితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కన్నడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించారు.
ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించిన ఇతర రాష్ట్రాల నేతలు వీరే
- తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
- తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు
- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్
- ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే
- మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్
- తమిళనాడు సీఎం స్టాలిన్
- ఏపీ సీఎం జగన్
- ఏపీ మాజీ సీఎం చంద్రబాబు
- కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్
- కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ
- కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియా
- కాంగ్రెస్ సీనియర్ నేత వాయిలార్ రవి
- కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్
- మాజీ మంత్రి చిదంబరం
- కాంగ్రెస్ సీనియర్ నేత మీరాకుమారి
- కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ శిందే
- కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్
- టీజేఎస్ అధినేత కోదండరామ్
- గాదె ఇన్నయ్య
- ప్రొఫెసర్ హరగోపాల్
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య
- తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు
- సినీ ప్రముఖులు
- కులసంఘం నేతలు, మేధావులు తదితరులను ఆహ్వానించారు.