ఓ మాయలేడి వలలో పడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ.21 లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో వెలుగుచూసింది. ధార్వాడ్‌కు చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్‌తో అంజలి శర్మ అనే మహిళ పరిచయం ఏర్పరుచుకుంది. అనంతరం వీరిద్దరూ వాట్సాప్‌లో కాల్స్ మాట్లాడుకునేవారు. కొన్నిసార్లు న్యూడ్ కాల్స్ చేసుకునేవారు. కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి వ్యవహరం ఒక్కసారిగా మలుపు తిరిగింది.
కొన్ని రోజుల తర్వాత అంజలి.. రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రైవేట్ వీడియోలను, ఫొటోలను స్క్రీన్ షాట్లను తీసి అతడికి మొబైల్‌కు పంపింది. తనకు రూ.3 లక్షలు ఇవ్వకపోతే న్యూడ్ ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో చేసేదేమీ లేక బాధితుడు.. అంజలి అడిగిన మొత్తాన్ని ఇచ్చేశాడు. ఇంతలో అంజలి సన్నిహితుడు విక్రమ్.. రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఫోన్ చేశాడు. తాను సైబర్ పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నాడు.
'మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన అంజలి నాకు తెలుసు. రూ.5 లక్షలు ఇస్తే మీ ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు తొలగించడానికి సాయం చేస్తా' అని ప్రొఫెసర్‌కు విక్రమ్ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడి ఖాతా నుంచి విడతలవారీగా రూ.21 లక్షలు కాజేశాడు విక్రమ్. ఈ క్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్.. అంజలి, విక్రమ్‌పై హుబ్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చదవండి: 14ఏళ్ల యోగా టీచర్.. ఒకేసారి రెండు పీహెచ్‌డీలు.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా!
రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. ప్రేమించడం లేదని రైలు కింద తోసేసి..