ETV Bharat / bharat

జేఈఈ మెయిన్-2021​​ ఫలితాలు విడుదల - National test agency

జేఈఈ మెయిన్స్​-2021 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్, దిల్లీ, చండీగఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్ చెందిన ఆరుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులూ సత్తా చాటారు.

Results of JEE-Mains for February 2021 session announced: Ministry of Education.
జేఈఈ మెయిన్స్​ ఫలితాలను విడుదల
author img

By

Published : Mar 8, 2021, 10:00 PM IST

Updated : Mar 8, 2021, 10:26 PM IST

జేఈఈ మెయిన్స్​ ఫలితాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్​టీఏ). ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో దిల్లీకి చెందిన ప్రవర్​ కటారియా, రంజిమ్​ ప్రబల్​ దాస్​లతో పాటు.. గుర్​ముత్​ సింగ్​(చండీగడ్), సాకేత్​ ఝా(రాజస్థాన్)​, సిద్ధాంత్​ ముఖర్జీ(మహారాష్ట్ర), అనంత కృష్ణ కిదాంబి(గుజరాత్)లు ఉన్నారు.

ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన పి.చేతన్ మనోజ్ఞ సాయి 99.99 పర్సంటైల్​ సాధించాడు. తెలంగాణలో చల్లా విశ్వనాథ్, కొమ్మ శరణ్య 99.99 పర్సంటైల్​తో​ టాపర్లుగా నిలిచారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది జేఈఈ మెయిన్‌-2021కు హాజరయ్యారు. ఇందులో 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తొలిసారిగా 13 భాషల్లో పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి: 1,008మంది మహిళలతో 'శివస్తోత్రం'- పులకించిన వారణాసి

Last Updated : Mar 8, 2021, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.