ఒడిశా భువనేశ్వర్‌లోని క్వీన్ ఎయిర్‌వేస్ రెస్టారెంట్.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విమానాన్ని తలపించేలా ఈ రెస్టారెంట్ నిర్మాణం ఉండటమే ఇందుకు కారణం. ఈ రెస్టారెంట్‌లో ఒకసారి భోజనం చేస్తే ఆకాశంలో ఎగురుతూ.. తిన్నభావన కలుగుతుంది.
అచ్చం ఎయిర్ హోస్టెస్లానే..
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ రెస్టారెంట్‌లో ఆహారాన్ని అందించే వారు కూడా.. ఎయిర్‌హోస్టెస్ దుస్తుల్లో కనిపిస్తారు. విమానంలోకి వచ్చే వారికి ఎయిర్ హోస్టెస్ ఏ విధంగా స్వాగతం పలుకుతారో.. అలాంటి ఆహ్వానమే ఇక్కడికి వచ్చే భోజన ప్రియులకు లభిస్తుంది. ఒకేసారి 20మంది కూర్చునేలా నిర్మించిన క్వీన్ ఎయిర్‌వేస్ రెస్టారెంట్‌లో నచ్చిన ఆహారం తీసుకునేందుకు కుటుంబ సమేతంగా స్థానికులు తరలివస్తున్నారు.

ధరలు తక్కువే!
సాధారణ రెస్టారెంట్లతో పోలిస్తే.. ఇక్కడి ఆహార పదార్థాల ధరలు తక్కువే. ఇక్కడ లభించే హైదరాబాద్, రాజస్థానీ పంజాబీ, బెంగాలీ వంటి 7 రాష్ట్రాలకు చెందిన వంటకాలను రుచి చూసేందుకు.. భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా.. రుచికరమైన ఆహారం అందించేందుకు ముగ్గురు చెఫ్‌లు పనిచేస్తున్నారు.
క్వీన్ ఎయిర్‌వేస్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనంతరం కస్టమర్లు సెల్ఫీలు దిగుతూ తమ అనుభూతులను.. ఇతరులతో పంచుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. విమానంలో మాదిరి నిర్మాణం ఉన్నందున ఎక్కువ మంది ఆదరిస్తున్నారని చెబుతున్నారు.
ఇదీ చూడండి:సాంబార్ ఫ్రీగా ఇవ్వలేదని జరిమానా- పోలీసులపై ఫిర్యాదు!