కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో యువతి సత్తా చాటారు. పథానంతిట్ట జిల్లాలోని అరువప్పులం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 21ఏళ్ళ రేష్మా మరియం రాయ్ ఎన్నికయ్యారు. గ్రామంలోని 11వ వార్డు నుంచి ఆమె 70 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
నామినేషన్ దాఖలు సమయంలోనే రేష్మా అతి చిన్న వయస్కురాలిగా వెలుగులోకి వచ్చారు. 2020, నవంబర్ 18న ఆమె 21వ ఏట అడుగు పెట్టారు. మరుసటి రోజే ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఆది నుంచి చురుకే..
పథానంతిట్ట కొన్నిలోని వీఎన్ఎస్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన రేష్మా.. గతంలో పలు సంఘాలలో పని చేశారు. డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ సభ్యురాలిగా, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) జిల్లా సెక్రెటేరియేట్ సభ్యురాలిగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్(సీపీఐఎం) పలు శాఖల్లో కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
కుటుంబ నేపథ్యం..
రేష్మా తండ్రి రాయ్ పీ మాథ్య్ కలప వ్యాపారిగా పని చేస్తుండగా.. తల్లి మిని రాయ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఉద్యోగి. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నారు.
ఇదీ చదవండి: గవర్నర్‌ను తొలగించాలని రాష్ట్రపతికి టీఎంసీ లేఖ