ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సొరంగం వద్ద మరోసారి సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వాటర్ లీకేజీనే కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటిని పంపింగ్ యంత్రాలతో బయటకు పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
రైనీ, తపోవన్ సహా తదితర గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు.. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ స్వాతి భదోరియా.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత.. బాధిత కుటుంబాలను కలిశారు.
58 మృతదేహాలు లభ్యం..
ఈ నెల 7న ధౌలిగంగ ఉద్ధృతితో సంభవించిన జలప్రళయంలో.. 200 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 58 మృతదేహాలు లభ్యమయ్యాయి. చమోలీ జిల్లాలో గత 10 రోజులుగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెలికితీసిన మృతదేహాల్లో 31 మందిని గుర్తించారు.
ఇదీ చూడండి: జగన్, కేసీఆర్ ఫొటోలకు గంగానదిలో పుణ్యస్నానం