ETV Bharat / bharat

Republic Day 2024 Chief Guest : వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా జో బైడెన్!.. మోదీ ఆహ్వానం మేరకు..

Republic Day 2024 Chief Guest : వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇటీవల దిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయమై బైడెన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని భారత్​లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు.

Republic Day 2024 Chief Guest
Republic Day 2024 Chief Guest
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 6:52 AM IST

Updated : Sep 21, 2023, 8:46 AM IST

Republic Day 2024 Chief Guest : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి బుధవారం ప్రకటించారు. సెప్టెంబర్​ 8న జీ-20 సదస్సులో భాగంగా ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీ.. బైడెన్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు. అదే సమయంలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ సభ్యులుగా ఉన్న క్వాడ్‌ సమావేశం జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం నిరాకరించారు.

  • US President Joe Biden has been invited to the January 26-Republic Day celebrations by PM Modi, during the bilateral meeting on the sidelines of the G20 summit, says US Ambassador Eric Garcetti. pic.twitter.com/FfrjWrnbd1

    — ANI (@ANI) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు భారత్‌ ప్రపంచ దేశాధినేతలను ముఖ్య అతిథులుగా ఆ‌హ్వానిస్తోంది. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని బైడెన్ అంగీకరిస్తే గణతంత్ర ఉత్సవాలకు అతిథిగా విచ్చేసిన రెండో అమెరికా అధ్యక్షుడిగా నిలుస్తారు.

Modi Biden Bilateral Talks : ఇటీవల దిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్​కు వచ్చిన ఆయన​.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ బైడెన్​కు మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేతలిద్దరూ పలు అంశాలపై చర్చించారు. బైడెన్​తో భేటీతో ఫలప్రదంగా జరిగిందని.. భారత్​- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై చర్చించినట్లు ఎక్స్​లో ఓ పోస్ట్​ చేశారు మోదీ. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల మధ్య ఒప్పందాలు..
చర్చల అనంతరం అమెరికా, భారత్​ మధ్య పలు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆవిష్కరణల్లో సహకారంతోపాటు శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సైబర్‌ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Biden Convoy Driver Detained : దిల్లీలో బైడెన్ డ్రైవర్‌ అరెస్ట్​! అలా చేయడమే కారణం!!

Jil Biden Tests Coronavirus Positive : జీ 20 ముందే జిల్ బైడెన్​కు కరోనా.. అధ్యక్షుడి భారత పర్యటనపై సస్పెన్స్​

Last Updated : Sep 21, 2023, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.