రెమ్‌డెసివిర్ కొరత ఉన్న దృష్ట్యా ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 38.80 లక్షల యూనిట్ల నుంచి 74 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలో లైసెన్స్ పొందిన ఏడు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
అందుకు అనుగుణంగా సరఫరా, రవాణాకు చర్యలు చేపట్టాలని కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కరోనా రోగుల చికిత్సకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం.. దేశంలో వీటికి కొరత ఏర్పడింది.
ఇదీ చూడండి: 'ఆక్సిజన్ ఉత్పత్తి'పై కేంద్రం కీలక ఆదేశాలు