ETV Bharat / bharat

'వారంతా కచ్చితంగా JIO సిమ్​ వాడాల్సిందే'.. ప్రభుత్వం కీలక ఆదేశాలు - గుజరాత్ ప్రభుత్వం రిలియన్స్​ జియో అగ్రీమెంట్​

ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి కేవలం జియో సర్వీసులను మాత్రమే వినియోగించాలని గుజరాత్​ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్​-ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

reliance-jio-service-to-all-government-employees-gujarat-government-key-decision

author img

By

Published : May 9, 2023, 7:33 AM IST

Updated : May 9, 2023, 9:08 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది గుజరాత్​ సర్కార్​. ఇకపై కేవలం జియో నెట్​వర్క్​ను మాత్రమే వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్​-ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ నంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్​పెయిడ్​ సేవలను.. ఉద్యోగులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.

గత కొంత కాలంగా గుజరాత్​ ప్రభుత్వ ఉద్యోగులు వొడాఫోన్​-ఐడియా పోస్ట్​పెయిడ్​ సర్వీసులను వాడుతున్నారు. ఇకపై ఉద్యోగులెవ్వరూ వొడాఫోన్​-ఐడియా సర్వీసులను వాడొద్దని సోమవారం గుజరాత్​ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కేవలం నెలకు రూ.37.50కే పోస్ట్​పెయిడ్ సేవలను జియో అందిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఏ మొబైల్​ ఆపరేటర్​కైనా, ల్యాండ్​లైన్​కైనా కాల్​ చేయవచ్చని వివరించింది. దాంతో పాటు నెలకు 3వేల ఉచిత SMSలను వాడుకోవచ్చని పేర్కొంది. ఈ SMS​ల పరిధి దాటితే.. ఒక్కో మెసేజ్​కు జియో 50పైసలను ఛార్జ్​ చేస్తుందని తెలిపింది. అదే విధంగా అంతర్జాతీయ SMSలకు రూ.1.25లను ఛార్జ్​ చేస్తుందని తెలిపింది.

ప్రభుత్వం, రిలయన్స్​ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా, 4జీ సర్వీసులతో లభిస్తుంది. వాటి పరిధి ముగిసినట్లయితే మరో 25 రూపాయలతో రీఛార్జ్​ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మరో 60 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. ఒకవేళ అన్​లిమి​టెడ్​ డేటా కావాలనుకుంటే.. 125 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 5జీ సేవలను కూడా 4జీ సేవల ధరలకే జియో అందిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్​, టీ షర్ట్​​ ధరించొద్దు! గవర్నమెంట్​ ఆదేశాలు..
కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్​ ధరించి ఆఫీసులకు రాకూడదని మహారాష్ట్ర గవర్నమెంట్​ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్​ కోడ్​ ప్రవేశపెడుతూ.. ఓ సర్కులర్ జారీ ఇచ్చింది.

డ్రెస్​కోడ్ ఇలా..

  • మహిళా ఉద్యోగులు చీరలు, చుడీదార్​లు, కుర్తాలు, ట్రౌజర్​ ప్యాంట్లు ధరించాలి. షర్ట్​లు ధరించేందుకు వీలుంది అయితే వాటిపై అవసరమైతే దుపట్టాలు వేసుకోవాలి.
  • పురుష ఉద్యోగులకు మాత్రం తక్కువ అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం. వారు ట్రౌజర్​ ప్యాంట్లు, షర్ట్​లు మాత్రమే వేసుకోవాలి.
  • ముదురు రంగు దుస్తులు, ఎక్కువగా డిజైన్ ప్యాట్రన్లు, బొమ్మలు ఉన్న దుస్తులు ధరించకూడదు. జీన్స్, టీ షర్ట్​లు వేసుకునేందుకు అనుమతి లేదు.
  • మహిళలు చప్పల్, సాండల్స్, షూ వేసుకోవచ్చు. పురుషులు షూ లేదా సాండల్స్ మాత్రమే వేసుకోవాలి. స్లిప్పర్లు ధరించేందుకు అవకాశమే లేదు.
  • చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు.. శుక్రవారం ఒక్క రోజైనా ఖాదీ దుస్తులు ధరించాలి.

డ్రెస్​ కోడ్ ఎందుకు?
అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు (ముఖ్యంగా కాంట్రాక్ట్​ సిబ్బంది) సరైన దుస్తులు ధరించడం లేదని గమనించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కారణంగా ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం తగ్గుతోందని గమనించినట్లు ప్రకటనలో తెలిపింది. ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంచి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని ఆశిస్తారని గుర్తు చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : May 9, 2023, 9:08 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.