ETV Bharat / bharat

'నీతా అంబానీపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవం' - రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్​ అంబానీ సతీమణి నీతా అంబానీని విజిటింగ్​ ప్రొఫెసర్​గా రావాలని బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయం ఆహ్వానం పంపిందన్న వార్తలు నిజం కావని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ స్పష్టం చేసింది. తమకు అసలు అలాంటి ప్రతిపాదనేదీ రాలేదని వెల్లడించింది.

Reliance Industries Limited refutes reports of Nita Ambani joining BHU as faculty
'నీతా అంబానీపై వస్తున్న ఆ వార్తలు నిజం కావు'
author img

By

Published : Mar 17, 2021, 2:37 PM IST

బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయంలో విజిటింగ్​ ప్రొఫెసర్​గా రావాలని రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ నీతా ముఖేశ్​ అంబానీకి ఆహ్వానం వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని రిలయన్స్​ గ్రూప్​ వెల్లడించింది. తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ అధికార ప్రతినిధి తెలిపారు.

నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్​గా ఆహ్వానించాలని యాజమాన్యానికి ప్రతిపాదన పంపించామని ప్రొ. నిధి శర్మ తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దాంతో​ ఆ ప్రతిపాదనను బీహెచ్​యూ విద్యార్థులు వ్యతిరేకించారు. ఈ మేరకు బీహెచ్​యూలో మంగళవారం ఆందోళనలు చేపట్టారు. నీతా అంబానీకి బదులుగా.. మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచిన వేరొకరిని ఆహ్వానించాలని డిమాండ్ చేశామని విద్యార్థి సంఘం నేత శుభం తివారీ అన్నారు.

ఇదీ చదవండి: 'మహిళా సాధికారత కోసం 'హెర్​ సర్కిల్​''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.