Relatives Murder Three People in Piduguralla: పల్నాడు జిల్లాలో భార్యాభర్తల మధ్య విబేధాలతో ఓకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురికావడం కలకలం రేపింది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన నరేష్ కు ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన మాధురికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. మొదటి భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న నరేష్.. మాధురిని రెండో వివాహం చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం భర్త తనను వేధిస్తున్నాడని మాధురి.. తన తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావుకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో తండ్రి, సోదరుడు కోనంకి మాధురి ఇంటికి వచ్చారు.
కడపలో 24 గంటల్లో మరో హత్య - తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని కత్తితో
Family Murder in Piduguralla: రాత్రి పదిన్నర గంటల సమయంలో నరేష్, అతడి తండ్రి సాంబయ్య, తల్లి ఆదిలక్ష్మిలపై.. కత్తులతో సుబ్బారావు, శ్రీనివాసరావు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మాధురి, ఆమె తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావు ముప్పాళ్ల వెళ్లిపోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆ తర్వాత ముగ్గురిని తీసుకుని పోలీసులు కోనంకి వచ్చారు. ఒకే గదిలో మూడు మృతదేహాలు ఉన్నాయి. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ముగ్గురిని ఒకేసారి హత్య చేయడం వెనుక అసలు కారణమేమిటో తెలియడం లేదని మృతులు బంధువులు అంటున్నారు.