ETV Bharat / bharat

ఆ ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థులకు చుక్కెదురు

రిటర్నింగ్​ అధికారి తమ నామపత్రాలను తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ.. కేరళ హైకోర్టు ఆశ్రయించిన ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేశాక తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ న్యాయస్థానం వారి పిటిషన్​ను తోసిపుచ్చింది.

Rejection of nomination in kerala high court
ఆ ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థులకు హైకోర్టులో చుక్కెదురు
author img

By

Published : Mar 22, 2021, 3:37 PM IST

కేరళలో నామినేషన్ల తిరస్కరణను సవాలు చేస్తూ ఎన్​డీఏకి చెందిన ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్​ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేశాక.. తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఏప్రిల్​ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలస్సేరి, గురవాయూర్, దేవికుళం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు భాజపా నుంచి ఇద్దరు, అన్నాడీఎంకే నుంచి ఒకరు నామినేషన్ వేశారు. అయితే నిబంధనలకు అనుగుణంగా లేవని రిటర్నింగ్​ అధికారి వాటిని తిరస్కరించారు. దీనిని సవాలు చేస్తూ కేరళ హైకోర్టును వారు ఆశ్రయించారు.

ఇదీ చూడండి:25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.