ETV Bharat / bharat

నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకా - టీకా నమోదు ఆన్​లైన్​

దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారికి నేటి నుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. టీకా లబ్ధిదారులు.. ఉదయం 9 గంటల నుంచి కొవిన్​ 2.0 యాప్​లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

COVID-19 vaccination
నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకా
author img

By

Published : Mar 1, 2021, 5:27 AM IST

Updated : Mar 1, 2021, 10:42 PM IST

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమం ప్రారంభం కానుంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారికి టీకా పంపిణీ చేయనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి కొవిన్​ యాప్​ 2.0లో వ్యాక్సిన్​ కోసం పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ యాప్​ సాయంతో లబ్ధిదారులు ఎక్కడనుంచైనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పింది.

ఓటీపీ ద్వారా..

కొవిన్ 2.0​ యాప్​లో వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్​ఫోన్​కు ఏ తేదీన, ఏ కేంద్రానికి వెళ్లాలో ఎస్​ఎంఎస్​ వస్తుంది. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. రిజిస్ట్రేషన్​ సమయంలో మొబైల్​ నంబర్​ను ధ్రువీకరించేందుకు సెల్​ఫోన్​కు ఓటీపీ వస్తుంది. ఒకే ​ మొబైల్​ నంబర్​తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఫోన్​ నంబర్​ మినహా మరే ఇతర వివరాలు ఒకే విధంగా ఉండకూడదు.

కొవిన్​ యాప్​తో పాటు, వ్యాక్సిన్​ కేంద్రం వద్ద కూడా రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ప్రభుత్వం ద్వారా అందించే వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాను ఉచితంగా వేస్తారని స్పష్టం చేసింది. ప్రైవేటులో టీకా ఖరీదు రూ.250 ఉంటుందని తేల్చి చెప్పింది.

కేంద్రం ఎక్కుడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.

టీకా కేంద్రానికి దారి తెలియక ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే కొవిన్​ 2.0 యాప్​నుకు జీపీఎస్​ను అనుసంధానించారు. టీకా పొందాలనుకున్న తేదీ, సమయం, పంపిణీ కేంద్రాన్ని ఎంపిక చేసుకుంటే.. ఆ యాపే పంపిణీ కేంద్రానికి దారి చూపిస్తుంది. ఈ యాప్​ సేవలను కొవిన్​ అధికారిక వెబ్​సైట్​ covin.gov.in లోకి ప్రవేశించి కూడా ఉపయోగించుకోవచ్చని వైద్య వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:పుణెలో మార్చి 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Last Updated : Mar 1, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.