ETV Bharat / bharat

ఏప్రిల్​ 1 నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్​ - అమర్​నాథ్​ యాత్ర

అమర్​నాథ్​ యాత్రకు ఏప్రిల్​ 1 నుంచి రిజిస్ట్రేషన్​లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. జూన్​ 28 నుంచి ఆగస్టు 22 వరకు యాత్ర కొనసాగనుంది.

Amarnath Yatra regestration starts on april 1st
ఎప్రిల్​ 1 నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్​లు ప్రారంభం
author img

By

Published : Mar 28, 2021, 5:34 AM IST

Updated : Mar 28, 2021, 7:12 AM IST

జూన్​ 28 నుంచి మొదలవనున్న అమర్​నాథ్​ యాత్రకు ఏప్రిల్​ 1 నుంచి రిజిస్ట్రేషన్​లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న.. పంజాబ్​ నేషనల్​ బ్యాంకు, జమ్ముకశ్మీర్​ బ్యాంకు, ఎస్​ బ్యాంకులకు సంబంధించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్​లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు తమ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

అమర్​నాథ్​ యాత్ర కోసం మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్​​లో ప్రయాణించాలనుకునేవారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి కారణంగా.. గతేడాది ఈ యాత్రను రద్దు చేశారు.

ఆగస్టు 22 వరకు యాత్ర కొనసాగనుంది.

ఇదీ చదవండి: జూన్​ 28 నుంచి అమర్​నాథ్​ యాత్ర

Last Updated : Mar 28, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.