ETV Bharat / bharat

ముంద్రా పోర్టులో రూ.4 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత - బంగారం స్మగ్లింగ్​

Red sandalwood smuggling: గుజరాత్​లోని ముంద్రా పోర్టులో రూ.4 కోట్లు విలువ చేసే ఎర్ర చందనం పట్టుకున్నారు డీఆర్​ఐ అధికారులు. హాంగ్​కాంగ్​కు తరలించే క్రమంలో గుట్టురట్టు చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి నుంచి రూ.5 కోట్లు విలువైన వజ్రాలను పట్టుకున్నారు.

Red sandalwood
ఎర్ర చందనం పట్టివేత
author img

By

Published : Dec 30, 2021, 1:11 PM IST

Red sandalwood smuggling: ఎర్ర చందన అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు గుజరాత్​ పోలీసులు. కచ్​ జిల్లాలోని ముంద్రా పోర్ట్​ గుండా హాంగ్​కాంగ్​ తరలిస్తున్న ఎర్ర చందనాన్ని బుధవారం పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దిల్లీకి చెందిన కంటెయినర్​ను తెరిచి చూడగా.. సుమారు 12-13 టన్నుల ఎర్ర చందనం గుర్తించినట్లు గాంధీధామ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటలీజెంట్​ (డీఆర్​ఐ) అధికారులు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని తెలిపారు.

రూ.5 కోట్లు విలువైన వజ్రాలు..

Diamonds smuggling: చెన్నై విమానాశ్రయంలో రూ.5 కోట్లకుపైగా విలువైన వజ్రాలను పట్టుకున్నారు కస్టమ్స్​ అధికారులు. బ్యాగులోని టెలిస్కోపిక్​ హ్యాండిల్​లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయ్​ వెళ్లే వ్యక్తి వద్ద డైమండ్లు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో.. నిఘా పెట్టారు అధికారులు. అనుమానిత ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా.. టెలిస్కోపిక్​ హ్యాండిల్​లో దాచి ఉంచిన వజ్రాలు బయటపడ్డాయి.

Diamonds smuggling
రూ.5 కోట్లు విలువైన వజ్రాలు
Diamonds smuggling
వజ్రాలు

రూ.1.1 కోట్లు విలువైన బంగారం

Gold smuggling in India: షార్జా నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్​కు అక్రమంగా బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటలీజెంట్​ అధికారులు. లోదుస్తుల్లో దాచి తీసుకొస్తున్న సుమారు రూ.1.1 కోట్లు విలువైన 2.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సగుబార్​ సదిక్​ సయ్యద్​ మోహమెద్​, నసార్దీన్​ మోహమెద్​ తంబి, కలీల్​ రకుమాన్​ ముస్తాఫా, తస్తకీర్​ కజమితీన్​లు.. రామనంతపురమ్​ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Gold smuggling
పట్టుబడిన బంగారం

ఇదీ చూడండి:

Drugs Seized at Jagathgiri Gutta : న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.