దేశంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ.. రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 3.44 లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించినవారి సంఖ్య 2 కోట్లు దాటింది. గత నాలుగు రోజుల్లో కొత్తగా నమోదైన కేసుల కన్నా రికవరీలు ఎక్కువగా ఉండటం ఇది మూడోసారి.
- మొత్తం రికవరీల్లో 71.16 శాతం మంది 10 రాష్ట్రాల నుంచే ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
- మహారాష్ట్రలో కొత్తగా 42,582 మందికి వైరస్ సోకింది. కేరళలో 39,955 మంది, కర్ణాటకలో 35,297 మంది కొవిడ్ బారిన పడ్డారు.
- పది రాష్ట్రాల్లో మరణాలు రేటు 72.70 శాతంగా ఉంది. అధికంగా మహారాష్ట్రలో 850 మంది, కర్ణాటకలో 344 మంది వైరస్‌కు బలయ్యారు.
- దేశవ్యాప్తంగా టీకా డోసు తీసుకున్న వారి సంఖ్య 18 కోట్లకు చేరువలో ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 17.92 కోట్ల మంది టీకా తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
టీకా తీసుకున్నవారి వివరాలు…
వైద్య సిబ్బంది
తొలి డోసు : 96,18,127
రెండో డోసు : 66,04,549
పారిశుద్ధ్య కార్మికులు
తొలి డోసు : 1,43,22,390
రెండో డోసు : 81,16,153
- 39,26,334 మంది 18-45 ఏళ్ల మధ్య వయస్కులు కొవిడ్ టీకా తొలిడోసు తీసుకున్నారు.
- 45-60 మధ్య వయసువారు.. 5,66,09,783 మంది తొలి డోసు, 85,39,763 మంది రెండో డోసు తీసుకున్నారు.
ఇదీ చదవండి:తీవ్ర విషాదంలో పన్నీర్‌సెల్వం కుటుంబం