మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రముఖ హిల్ స్టేషన్‌గా పేరొందిన ఈ ప్రాంతంలో కేవలం తొమ్మిది రోజుల్లో 2,829 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా జులై 22, 23 తేదీల్లో వరుసగా 480మి.మీ, 574 మి.మీ మేర వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల ఈ ఏడాది అధిక వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చెట్లు అధికంగా ఉండడం వల్ల మేఘాలు కొండలను తాకుతున్నాయి. దీంతో భారీగా వర్షం కురిసినట్లు పేర్కొన్నారు.
ఈ భారీవర్షాల కారణంగా సమీపంలో ఉన్న చెరువులు నిండాయి. రహదారులపై నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. పొలాలు అన్నీ నేలమట్టమయ్యాయి.
తేదీల వారీగా వర్షపాతం వివరాలు(మి.మీలో)
- జులై 19- 97.8
- జులై 20- 109.8
- జులై 21- 164.0
- జులై 22- 480.0
- జులై 23- 594.4
- జులై 24- 321.0
- జులై 25-186.7
- జులై 26 - 85.2
- జులై 27 - 85.2
మహాబలేశ్వర్ తరువాత రాయ్‌ఘడ్, రత్నగిరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఇదీ చూడండి: నరమాంసం తింటూ.. పుర్రెతో నృత్యాలు!