వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రాతపూర్వక హామీలతో రావాలని కోరుతున్నామని తెలిపారు.
"కేంద్రం తీరును చూస్తుంటే.. చర్చలను ఆలస్యం చేయాలని, నిరసన తెలిపే రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. మా సమస్యలను ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, సత్వరం పరిష్కారం చూపాలని హెచ్చరిస్తున్నాం."
- యుధ్వీర్ సింగ్, భారతీయ కిసాన్ సంఘ్
కనీస మద్దతు ధరపై స్వామినాథన్ సిఫార్సుల మేరకు చట్టం తేవాలని రైతు సంఘాల నాయకులు సూచించారు. తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకే ఈ కుట్రలు పన్నుతున్నారని వివరించారు. రైతులు చర్చలకు సిద్ధంగా లేరని చేసే ప్రచారం అవాస్తవమన్నారు.
ఇదీ చదవండి : 'సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు'