ETV Bharat / bharat

రూ.5 కోట్లు పలికిన గుర్రం.. అయినా అమ్మేందుకు ఓనర్ నో! - గుర్రాల మార్కెట్​

Raven horse for sale: నల్లగా ఉంటాడు, బలిష్టంగా ఉంటాడు, వేగంగా పరిగెడతాడు. వాడి పేరు రావణుడు. కానీ వాడు మనిషి కాదు గుర్రం. గుర్రానికి ఎందుకింత ఉపోద్ఘాతం అంటే.. దాని ఖరీదు రూ.5 కోట్లపైమాటే. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ రూ.5 కోట్లు ఇస్తానన్నా రావణ్‌ను విక్రయించేందుకు దాని యజమాని ఒప్పకోలేదు. మరి ఆ అశ్వం సంగతులేమిటో చుద్దాం.

Raven horse for sale
రూ.5 కోట్లు పలికిన రావణ్​
author img

By

Published : Dec 23, 2021, 12:56 PM IST

రూ.5 కోట్లు పలికిన రావణ్​ గుర్రం

Raven horse for sale: మహారాష్ట్రలోని నందూర్బర్ జిల్లా సారంగ్‌ఖేడ్ అశ్వాల మార్కెట్‌ స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేర్వేరు జాతుల గుర్రాలు.. ఏటా ఇక్కడకు అమ్మకానికి వస్తాయి. నాసిక్‌ నుంచి వచ్చిన 10 అశ్వాలు ఈసారి సారంగ్‌ఖేడ్‌ మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకున్న గుర్రమే రావణ్‌. రూ.5 కోట్లు ఇచ్చి కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా అమ్మేందుకు దాని యజమాని అసద్ సయ్యద్‌ నిరాకరించారు.

అశ్వం రావణ్‌ నల్లగా ఉంది. నుదుటిపై.. తెల్లని మచ్చ ఉంది. ఇది మార్వార్‌ జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తు ఉంది. మహారాష్ట్రలో కెల్లా ఇదే ఎత్తైన గుర్రమని దాని యజమాని చెబుతున్నారు. రావణ్‌ రోజుకు పది లీటర్ల పాలు, కేజీ నెయ్యి, ఐదు గుడ్లు, చిరు ధాన్యాలు, తవుడు, ఎండు పండ్లు తింటుందని అసద్ సయ్యద్‌ చెప్పారు. ఇది చాలా అరుదైనది కాబట్టి ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖరీదు ఉంటుందని, అందుకే ఐదు కోట్లకు అమ్మేందుకు నిరాకరించానని ఆయన అన్నారు.

Raven horse for sale
రూ.5 కోట్లు పలికిన రావణ్​

పంజాబ్ జాతికి చెందిన 34 నెలల వయసున్న.. తెల్లని నూక్రా గుర్రం కూడా మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సారంగ్‌ఖేడ్ మార్కెట్‌లో ఈసారి 4 రోజుల్లోనే 278 గుర్రాలు అమ్ముడుపోగా వాటిలో కోటి, కోటిన్నర పలికిన అశ్వాలు కూడా ఉన్నట్లు మార్కెట్‌ అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: కుక్క మరణంపై న్యాయపోరాటం- 9 ఏళ్లకు పరిహారం

కుమార్తెకు రూ.12వేలతో ఫోన్​ కొని.. రూ.8వేలతో ఊరేగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.