ETV Bharat / bharat

వాయు కాలుష్యంతో భారత్​లో గర్భస్రావాల ముప్పు ఎక్కువ - వాయు కాలుష్యం

భారత్​లో వాయుకాలుష్యానికి ఎక్కువగా గురయ్యే గర్భిణులకు గర్భస్రావాల ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనం దేశంతోపాటు పాకిస్థాన్​, బంగ్లాదేశ్​లోనూ వాయుకాలుష్య ప్రభావం వల్ల గర్భస్రావం, మృత శిశువుకు జన్మనివ్వటం వంటి ముప్పులు ఎక్కువని ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్​'లో కథనం ప్రచురితమైంది.

rate of abortion is increasing in india due to air pollution
వాయు కాలుష్యంతో భారత్​లో గర్భస్రావాల ముప్పు ఎక్కువ
author img

By

Published : Jan 8, 2021, 7:35 AM IST

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్​లో వాయుకాలుష్యానికి ఎక్కువగా గురయ్యే గర్భిణులకు గర్భస్రావం, మృత శిశువుకు జన్మనివ్వడం వంటి ముప్పులు ఎక్కువని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్​'లో ఈ మేరకు ఒక కథనం ప్రచురితమైంది.

"ప్రపంచంలోనే గర్భస్రావాలు అధికంగా ఉన్న ప్రాంతం దక్షిణాసియా. గాల్లో 'పీఎం 2.5' రేణువుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఉంది," అని పరిశోధనకు నాయకత్వం వహించిన టాఫో షు చెప్పారు.

ఈ పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం..

  • భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం గాల్లోని పీఎం 2.5 రేణువులు..క్యూబిక్​ మీటరుకు 40 మైక్రో గ్రాముల మేర ఉండాలి. దక్షిణాసియాలో అంతకన్నా ఎక్కువగా కాలుష్యానికి గురికావడం వల్ల ఏటా 3,49,681 మంది మహిళలు గర్భాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 2000-2016 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో ఏటా జరిగిన గర్భస్రావాల్లో ఇది 7శాతం.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యాహెచ్​ఓ) మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 రేణువులు..క్యూబిక్​ మీటరుకు 10 మైక్రోగ్రాములు మించకూడదు. ఆ స్థాయి మించడం వల్ల జరిగిన గర్భస్రావాలు 29 శాతం ఉండొచ్చు.
  • గర్భాన్ని కోల్పోడం వల్ల మహిళలు కుంగుబాటుకు గురికావడం, తదుపరి ప్రసవాల్లోనూ గర్భశోకాన్ని భరించాల్సి రావడం, ఆర్థిక భారం పెరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.
  • స్త్రీ-పురుష సమానత్వాన్ని మెరుగుపరచేందుకు చేపట్టే చర్యలపైనా ఇది ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యంతో ముడిపడిన గర్భస్రావాలు భారత్​లోని ఉత్తర మైదాన ప్రాంతంలో, పాకిస్థాన్​లో అధికం. 30 ఏళ్లలోపు గ్రామీణ మహిళల్లో ఇలాంటి గర్భస్రావాలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఇదీ చదవండి : మూల్యం చెల్లించాల్సింది కాలుష్య కారకులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.