ETV Bharat / bharat

Rat In Chicken Curry : చికెన్ కర్రీలో ఎలుక.. తింటుండగా చూసి బ్యాంక్​ మేనేజర్​ షాక్​.. చివరకు.. - చికెన్​లో చచ్చిన ఎలుక

Rat In Chicken Curry : ఓ రెస్టారెంట్​లో సర్వ్ చేసిన చికెన్ కర్రీలో ఎలుక వచ్చింది. దీంతో కస్టమర్ ఆ రెస్టారెంట్ సిబ్బందిపై మండిపడ్డారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ రెస్టారెంట్ మేనేజర్​ను అరెస్టు చేశారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

Rat In Chicken Curry
Rat In Chicken Curry
author img

By

Published : Aug 17, 2023, 7:47 AM IST

Updated : Aug 17, 2023, 8:11 AM IST

Rat In Chicken Curry : స్నేహితుడితో కలిసి రెస్టారెంట్​కు వెళ్లిన ఓ బ్యాంక్ మేనేజర్​కు వింత అనుభవం ఎదురైంది. వారికి సర్వ్ చేసిన చికెన్ కర్రీలో చనిపోయిన ఎలుక వచ్చింది. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ హోటల్ మేనేజర్​ను, కుక్​లను అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​కు చెందిన అనురాగ్​ దిలీప్​ సింగ్​(40).. గోరేగావ్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 13వ తేదీన.. ఆయన తన స్నేహితుడు అమీన్​ ఖాన్​తో షాపింగ్​కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బాంద్రాలోని పాపా పంచో ద దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ చికెన్​, మటన్​ కర్రీలను ఆర్డర్​ చేశారు.

Rat Found In Bandra Restaurant : కాసేపటికి సర్వర్​.. అనురాగ్​ చెప్పిన ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ తినడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనురాగ్​.. తాను తింటున్న చికెన్ కర్రీలో ఓ ముక్క అసాధారణంగా ఉండటాన్ని గమనించాడు. దాన్ని బాగా పరిశీలించగా అది చనిపోయిన ఎలుక అని తెలుసుకుని షాకయ్యాడు. దీంతో సిబ్బందిని పిలిచి ప్రశ్నించారు. ఆ సమయంలో హోటల్ మేనేజర్ వివియన్ ఆల్బర్ట్ సిక్వేరా అక్కడ అందుబాటులో లేడు. దీంతో ఆయనకు ఫోన్ చేసి హోటల్​కు రప్పించి ఎలుకను చూపించారు. కానీ అతడు.. వారికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు.

Baby rat found in chicken curry
చికెన్​ కర్రీలో ఎలుక

ఆ తర్వాత అనురాగ్​ తన స్నేహితుడితో కలిసి బాంద్రా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చనిపోయిన ఎలుకను ఆహారంలో పెట్టి ప్రాణహాని కలిగిస్తున్నారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్​కు వెళ్లిన పోలీసులు.. మేనేజర్​తోపాటు మరో ఇద్దరు వంటచేసే వాళ్లను అరెస్ట్​ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వారు ముగ్గురు.. బెయిల్​పై విడుదలయ్యారు. తాను ఘటన జరిగిన వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నానని ఫిర్యాదుదారు తెలిపారు. డాక్టర్​ మందులు కూడా రాసి ఇచ్చారని చెప్పాడు.

Last Updated : Aug 17, 2023, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.